04-03-2025 06:38:16 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ముల్కల్లగూడెంకు చెందిన ముల్కల్ల సత్యనారాయణ (44) అనే వ్యక్తి ఈత రాక ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందాడని స్థానిక ఎస్సై సతీష్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం మృతుడు కాగజ్ నగర్ ఎస్సి వసథిగృహంలో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం గోదావరి నదికి స్నానం కోసం వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడన్నారు. మృతుని భార్య సుమలత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.