calender_icon.png 16 January, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి

15-01-2025 10:50:07 PM

లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఎక్కించుకోబోతూ కిందపడి దుర్మరణం...

హుస్నాబాద్ (విజయక్రాంతి): లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఎక్కించుకోబోతుండగా బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి కిందపడి చనిపోయాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన పులికాశి సంపత్(50) తన బైక్ పై రాత్రి 8 గంటల ప్రాంతంలో హుస్నాబాద్ నుంచి చౌటపల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి అతడిని లిఫ్ట్ అడిగాడు. ఆయనను ఎక్కించుకుందామని సడెన్ గా బ్రేక్ వేశాడు. దీంతో బైక్ అదుపు తప్పి లిఫ్ట్ అడిగిన వ్యక్తిని ఢీకొడుతూ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.