06-02-2025 12:50:38 AM
ఖమ్మం, ఫిబ్రవరి 5 ( విజయక్రాంతి ): సత్తుపల్లి మండలం తాళ గ్రామం వద్ద ప్రధాన రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌కే షాజహాన్, ఆసిఫ్‌లు బైక్‌పై వస్తుండగా లారీ వేగం వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో షాజహాన్ అక్కడికక్కడే మృ చెందగా.. ఆసిఫ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాగా.. ఆసిఫ్ పరిస్ధితి విషమంగా ఉంది. కాగా మృతుడు షాజహాన్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.