07-04-2025 12:00:00 AM
కల్లూరు, ఏప్రిల్ 6 :- మండలం లోని ప్రధాన రహదారి పైశనివారం రాత్రి రెండు మోటారు సైకిళ్ళు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఓబుల్ రావు బంజర గ్రామానికి చెందిన బానోతు చిన్నకృష్ణ అతని రెండవ కుమారుడు బానోత్ వేణు, అదే గ్రామానికి చెందిన మాలోత్ అనిల్ అను ముగ్గురూ మోటార్ సైకిల్ పై కల్లూరు నుండి ఓబులరావు బంజర గ్రామం వెళ్తుండగా కల్లూరు ఊరు బయటగల నక్షత్ర బిర్యాని హోటల్ వద్దకు వచ్చేసరికి ఖమ్మం వైపు నుండి కల్లూరు వైపు వస్తున్న మోటార్ సైకిల్ ను వాహనాన్ని క్రాస్ చేసే క్రమంలో ఎదురెదు రు గా డీ కొనగా భానోత్ వేణు అక్కడికక్కడే చనిపోయాడు. మోటార్ సైకిల్ పై వెనకాల కూర్చున్న బానోత్ చిన్నకృష్ణ, మాలోత్ అనీల్ లకు స్వల్ప గాయాలయ్యాయి.పల్సర్ ను నడిపిన వ్యక్తి బయ్యవరపు జస్వంత్ సాయి భానోత్ చిన్నకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్త్స్ర డి.హరిత కేసు దర్యాప్తు చేస్తున్నారు.