14-04-2025 12:20:39 AM
ఘటన వద్ద రోదించిన కుటుంబ సభ్యులు
తిమ్మాపూర్, ఏప్రిల్ 13, (విజయ క్రాంతి): కంకర లోడు టిప్పరు ద్విచక్ర వాహ నపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన ఆదివారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి లోని అలుగునూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పోలీసుల కథనం మేరకు అలుగునూర్ గ్రామానికి చెందిన వేల్పుల లచ్చయ్య 49 తన మోటార్ సైకిల్ పై కరీంనగర్ వైపు వెళ్తున్నాడు.
కాగా కరీంనగర్ వైపు నుండి హైదరాబాద్ వైపునకు వెళ్ళుచున్న కంకర టిప్పర్ బండి నెంబర్ ఎపి 16 టీజే 5716 గల డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా లారీని నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో లచ్చయ్య, తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థాని కులు కుటుంబ సభ్యులకు సమా చారం అందించడంతో ఘటన స్థలా నికి చేరుకున్న భార్య చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుని భార్య వేల్పుల రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ ఎం డి ఎస్ ఐ వివేక్ తెలిపారు.