19-09-2024 12:23:59 AM
చేవెళ్ల, సెప్టెంబర్ 18: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. శంకర్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్కాపూర్ శివారులో బుధవారం ఓ గుర్తుతెలియన వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి శంకర్‌పల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.