25-03-2025 12:16:08 AM
మరొకరికి తీవ్రగాయాలు
మిర్యాలగూడ, మార్చి 24 (విజయక్రాం తి) : అదుపుతప్పి లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలివి.. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన దాసరి జానకి రాములు (50) అదే గ్రామానికి చెందిన బచ్చు శ్రీనుతో కలిసి ఆదివారం సాయం త్రం ధాన్యం విక్రయించేందుకు ఈదులగూడెం శివారులోని కీర్తి రైస్మిల్లుకు ట్రాక్టర్తో వచ్చాడు.
రాత్రి కావడంతో ధాన్యం ట్రాక్టర్ను అక్కడే ఉంచి భోజనం చేసి మిల్లుకు తిరిగి వస్తుండగా ఆర్డీఓ కార్యాలయం సమీపంలోకి హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ వేగంగా ఇద్దరిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికి త్స నిమిత్తం 108 వాహనంలో ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ జానకిరాములు సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుమారుడు నాగ సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.