calender_icon.png 20 April, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్ వాహనానికి ఢీకొని వ్యక్తి మృతి

07-04-2025 12:35:48 AM

దౌల్తాబాద్, ఏప్రిల్ 6: ఎదురెదురుగా వస్తున్న అంబులెన్స్ 108 వాహనం ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మం డలం రాంసాగర్ గ్రామానికి చెందిన శంభు రమేష్ (38) ద్విచక్ర వాహనం పై రాంసాగర్ నుంచి రాయపోల్ వైపుకు వస్తున్నారు. అదే క్రమంలో దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపుకు వెళుతున్న 108 వాహనం రాయపోల్ మండల కేంద్రంలో నాగులమ్మ గుడి వద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు శంభు రమేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా అతడిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స పొందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘుపతి తెలిపారు.