11-04-2025 08:24:50 PM
కొల్చారం,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చిన్న ఘనపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని చిన్న ఘనపూర్ శివారులో పెద్ద చెరువు నందు మృతుడు పోతగోని రాము గౌడ్(23) మూగవాడు. ప్రతిరోజు తన బర్రెలు మేపుకుంటూ జీవిస్తున్నాడు. అదే మాదిరిగా గురువారం ఉదయం 10 గంటలకు బర్రెలు మేపడానికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసుకొని తిరిగి బర్రెలు కాడికి వెళ్ళాడు. సాయంత్రం ఆరున్నర గంటలకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆచూకి లభించాలేదు. చివరకు చిన్న ఘనపూర్ శివారులోని పెద్ద చెరువు దగ్గర అతని చెప్పు కనిపించడంతో నీటిలో వెతికగా దొరకలేదు. రాత్రి అయినందున మరుసటి రోజు శుక్రవారం ఉదయం అందాజా ఆరు గంటలకు చెరువు దగ్గరికి వెళ్లి చూసేసరికి నీటిపై శవమై కనిపించాడు. మృతుడు పూతగోని రామ గౌడ్ ఈత రానందున ప్రమాదవశత్తు నీటిలో పడి చనిపోయాడు. మృతుని తండ్రి పోతగోని ఆగం గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ వెల్లడించారు.