calender_icon.png 6 February, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి వ్యక్తి మృతి

06-02-2025 12:00:00 AM

నిజామాబా ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : నడుస్తున్న రైలులో నుంచి ప్రమాదవ శాత్తుపడి వ్యక్తి మరణించాడు ఈ సంఘటన చెందిన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. చిన్నా పల్లి ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో మేడ్చెరుకు చెందిన చిట్యాల భూమిరెడ్డి (80) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవ శాత్తు కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

నడిచే రైలు నుంచి జారిపడిన భూమిరెడ్డి తనకు బలమైన గాయాలు తగలడంతో మృతిచెందినట్టు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపారు.

బుధవారం జరిగిన ఈ సంఘటన విష యమై రైల్వే స్టేషన్ మేనేజర్  ఇచ్చిన సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నిజాంబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.