25-04-2025 08:40:30 PM
పాపన్నపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఏడుపాయల ఆలయ సమీపంలో చెక్ డ్యామ్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన దేవరపాగ వీరస్వామి (40) గత కొన్ని సంవత్సరాలుగా రామచంద్రపురం మండలంలో ఉంటూ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు.
స్నానం చేసేందుకు ఆలయ సమీపంలో ఉన్న చెక్ డాం వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి పోయాడు. అక్కడే ఉన్న కుటుంబీకులు గమనించి కాపాడే యత్నం చేశారు.పోలీసులకు సమాచారం అందించగా వారి ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాలతో నీటిలో గాలించగ మృతదేహం లభ్యం అయింది మృతదేహాన్ని పంచనామ నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి భార్య మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.