calender_icon.png 26 February, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో వ్యక్తి మృతి

26-02-2025 12:15:01 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 25: గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన కటకం వెంకన్న(55) గత కొన్ని సంవత్సరాలుగా మెకానిక్ వృత్తిలో రాణిస్తున్నాడు. రోజువారి భాగంలో తన ట్రాక్టర్ మెకానిక్ షెడ్డులో పనులు నిర్వర్తిస్తుండగా సాయంత్రం ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్ప కూలిపోయాడు. తక్షణమే చికిత్స కోసం హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెంది నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలో ప్రతి వ్యక్తితో పరిచయాలు ఉండడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.