05-03-2025 01:30:56 AM
కట్టుకున్న భార్య పై హత్యాయత్నం
పరిస్థితి విషమం
పాల్వంచ, మార్చి 4 (విజయ క్రాంతి): అనుమానం పెనుభూతమైంది.. ఆ గ్రహం కట్టలు తెగింది.. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య పైనే భర్త కత్తితో దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాల్వంచలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని బొల్లారంగూడెంలో వర్తక సంఘం రోడ్ లో నివాసముంటున్న రవీందర్ మంగళవారం ఉదయం భార్య లక్ష్మిపై అనుమానంతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది, చివరకు భార్య లక్ష్మి ఇంటి నుండి బయటికి వచ్చింది..
ఈ క్రమంలో భార్య స్థానిక పోలీస్ స్టేషన్ వెళుతుందనే అనుమానంతో భర్త రవీందర్ వెంబడిం చారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నిలుచొని ఉన్న భార్యపై భర్త అందరూ చూస్తుండగానే కత్తితో దాడి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విషయం తెలుసు కున్న చుట్టుపక్కల వారు వెంటనే పోలీసు లకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రురాలని పాల్వంచ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనం తరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు