calender_icon.png 23 October, 2024 | 11:07 AM

వ్యక్తి ప్రాణం తీసిన కుక్క పంచాయతీ.!

10-07-2024 01:54:17 PM

నాగర్ కర్నూల్: సాధారణంగా అన్నదమ్ముల మధ్య పంచాయితీ, ఇంట్లో ఆస్తి తగాదాలు, ఇరుగుపోరుగు వారితో పంచాయితీ అయితే చనిపోవడం చూశాం. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో ఓ వ్యక్తి కుక్క పంచాయితీతో చనిపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... వెలిగొండ గ్రామానికి చెందిన కుందేళ్ళ మల్లయ్యకు కుందేళ్ళ రాజు (45), కుందేళ్ళ బీరయ్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి మధ్య గత కొంతకాలంగా పొలం పంచాయతీ నడుస్తోంది.

కాగా ఆదివారం రాత్రి కుందేళ్ళ రాజు ఇంటి పక్కనే నివాసముంటున్న తన తండ్రి మల్లయ్యను పలకరించేందుకు బీరయ్య అటుగా వెళుతుండగా రాజుకు చెందిన కుక్క బీరయ్యపై మొరగడంతో కర్చేందుకు వస్తుందని గ్రహించి కుక్కపై రాయి విసిరాడు. దాన్ని చూసిన రాజు బీరయ్యపై చేయి చేసుకున్నాడు. మరసటి రోజు భీరయ్య రాజుపై బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం రాజును పిలిచి మందలించి బుధవారం కూడా స్టేషన్ కు మళ్లీ రావాలని ఆదేశించారు.

దీంతో మనస్థాపంతో ఇవాళ తెల్లవారుజామున ఎవరులేని సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పడ్డాడు. గతంలోనే పోలీసు కేసులు ఉన్న భీరయ్య పోలీసుల సహకారంతో టార్చర్ చేయడం వల్లే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని రాజు అత్త కురువమ్మ  ఆరోపించింది. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై ఎస్ఐని  వివరణ కోరగా ఇద్దరూ అన్నదమ్ములు పెద్దల సమక్షంలో కలిసి మాట్లాడుకోమని చెప్పటమే తప్ప ఇప్పటివరకు తాను ఎవరిపై చేయి చేసుకోలేదన్నారు.