18-03-2025 08:03:28 PM
దౌల్తాబాద్: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాయపోల్ మండల కేంద్రానికి చెందిన గూని ఎల్లం (40) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎల్లం కూలి పనికి వెళ్లి వస్తూ మద్యం మత్తులో భార్య నవనీతతో గొడవ పడుతున్నారు. సోమవారం రాత్రి కూడా అదే విధంగా భార్యాభర్తలు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు రాత్రి భోజనం చేసి నిద్రించిన తర్వాత అర్ధరాత్రి ఎల్లం ఇంట్లో నుండి వెళ్లిపోయి వారి వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళిన స్థానిక రైతులు గమనించి ఎల్లం ద్విచక్ర వాహనం పొలం వద్ద ఉంది. కానీ అతను కనబడడం లేదని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి ఎల్లం ఆచూకీ కోసం వెతకగా వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు.