13-03-2025 12:00:00 AM
పాపన్నపేట, మార్చి 12: కుటుంబ కలహాలతో విషం సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అవుసుల రాములు (40) గోల్ స్మిత్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ క్రమంలో భార్య సరళ పిల్లలను తీసుకొని నెల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో అప్పటినుండి దిగులుగా ఉండేవాడు.బుధవారం ఉదయం గ్రామ ప్రధాన రోడ్డు పక్కన గుర్తుతెలియని విషం సేవించి కింద పడిపోయి ఉన్నాడు.అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించి మృతుడి తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.