20-02-2025 12:59:06 AM
వనపర్తి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో చోటు చేసుకుంది.
ఎస్‌ఐ రాణి తెలిపి న వివరాల ప్రకారంగా మండల పరిదిలోని బొల్లారం గ్రామానికి చెందిన రాచాల శ్రీనివాస్ గౌడ్ (50) అనే వ్యక్తి గత కొన్ని నెలలు గా భార్య పిల్లలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి బ్రతుకుదెరువు నిమిత్తం వెళ్లినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం రాచాల శ్రీనివాస్ గౌడ్ కు చెందిన బంధువు ఒకరు చనిపోవడంతో గ్రామానికి రావడం జరిగింది.
గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో విసుగు చెంది రాచాల శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.