calender_icon.png 4 March, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం బాగాలేక వ్యక్తి ఆత్మహత్య

04-03-2025 07:52:43 PM

కొండపాక: ఆరోగ్యం బాగాలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన షలంపు గ్రామంలో చోటుచేసుకుంది. త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం కొండపాక మండలం షలాంపు గ్రామానికి చెందిన చిలుముల రమేష్ (38) గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళినది. మృతుడు రమేష్ సిద్దిపేట లో ప్లంబర్ పనిచేస్తూ వివిధ ఆసుపత్రిలో చూపించిన తన ఆరోగ్యం కుదుట పడలేదు. సోమవారం తన తల్లితో కలిసి భోజనం చేసి పడుకున్నాడు.

మధ్య రాత్రి తల్లి లేచి చూసేసరికి తన కొడుకు కనిపించక పోవడంతో ఆరు బయట వెతుకుచుండగా రేకుల షెడ్డలొ వేలాడుతూ కనిపించాడు. వెంటనే తన ఇద్దరు కొడుకులతో కలిసి కిందికి దించి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్ చూసి అప్పటికే చనిపోయాడని తెలిపారు. మృతుని తల్లి భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపారు.