calender_icon.png 27 December, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల ఫీజుల కోసం అప్పు.. ఒత్తిడితో తండ్రి ప్రాణాలు వదిలాడు

06-12-2024 10:24:20 AM

మేడ్చల్: వడ్డీ వ్యాపారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జీడిమెట్ల పరిధి రంగానగర్ లో ఉరేసుకుని సంతోష్(34) ప్రాణాలు తీసుకున్నాడు. మూడ్రోజుల క్రితం వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పిల్లల ఫీజుల కోసం సంతోష్ అప్పు చేశాడు. మూడు నెలలుగా వడ్డీ చెల్లించలేదని వడ్డీ వ్యాపారి ఒత్తిడి తేచ్చాడు. వడ్డీ వ్యాపారి ఒత్తిడితో సెల్ఫీ వీడియో తీసుకుని సంతోష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంతోష్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.