calender_icon.png 8 January, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

06-01-2025 12:00:00 AM

తంగళ్ళపల్లి, జనవరి 5: తంగళ్ళపల్లి మండలం తాడూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళితే  గ్రా మానికి చెందిన కొమరవెల్లి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత నాలుగు సంవ త్సరాల క్రితం సొంత స్థలంలో అప్పులతో రేకుల షెడ్డు ఇల్లు కట్టుకున్నాడు.

ఈ క్రమం లో సరైన ఉపాధి కూలీ దొరకకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పులు అధిక మై మనస్థాపం చెంది, గ్రామపంచాయతీ వద్ద ఉన్న మార్క్ పోను టవర్ ఎక్కి పైన నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య లత, కూతు రు, తల్లి బుచ్చవ్వలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..