calender_icon.png 23 December, 2024 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

23-12-2024 01:05:26 AM

ఇంటికి తాళం వేస్తామని అప్పు ఇచ్చిన వారి బెదిరింపులే కారణం

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వకుంటే ఇంటికి తాళం వేస్తామని బెదిరించడంతో అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని మదురానగర్ కాలనీలో నివాసం ఉంటున్న గున్న ముత్యాలు(40) జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.

అదే కాలనీకి చెందిన వందన వద్ద ముత్యాలు భార్య రజిత ఇంటి అవసరాల కోసం భర్తకు తెలియకుండా రూ.1.50 లక్షలు అప్పు తీసుకుంది. విషయం తెలిసిన తర్వాత కొని రోజుల క్రితం ముత్యాలు రూ.లక్ష తిరిగి చెల్లించాడు. ఇంకా రూ.50 వేలు ఇవ్వాల్సి ఉన్నది. వాటికోసం శనివారం వందన తన భర్త సుధాకర్‌తో కలిసి ముత్యాలు ఇంటికి వెళ్లారు. పంచాయితీ పెట్టి డబ్బులు ఇవ్వకుంటే ఇంటికి తాళం వేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.

అవమానానికి గురైన ముత్యాలు మనస్తాపం చెంది ఇంట్లోకి వెళ్లి గడియపెట్టి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఇంటి తలుపులను బద్దలు కొట్టి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తనభర్త చావుకు కారణమైన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.