calender_icon.png 29 December, 2024 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

29-12-2024 01:18:59 AM

డిసెంబర్ 28 (విజయక్రాం తి) : అప్పుల బాధ భరించలేక, జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం.. మెట్‌పల్లికి  చెందిన కంభంపాటి వినయ్ (34) కోరుట్ల పట్టణంలోని ఐబీ రోడులో గత 4 నెలల నుంచి అద్దె ఇంట్లో ఉంటు న్నాడు. కరీంనగర్లో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ, తన అవసరాల కోసం అప్పు లు చేశాడు. అప్పుల బాధ భరించలేక ఇంట్లో  సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొ ని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి తండ్రి దామోదర్  ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.