calender_icon.png 25 February, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాత్రూంలో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య

24-02-2025 11:23:03 PM

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు కారణంగా ఓ వ్యక్తి బాత్రూంలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ మేడిబావి వద్ద నివసించే నర్సింగ్ రావు ఘట్కేసర్ లోని పవర్ గ్రిడ్‌లో చీఫ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు ఉండటం, కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు.

దీంతో సోమవారం ఉదయం బాత్‌రూంలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిపారు. బాత్రూం నుంచి ఎంతకీ రాకపోయే సరికి తలుపులు పగులగొట్టి తీయడంతో రక్తపుమడుగులో ఉండడాన్ని గమనించారు. నర్సింగ్ రావు కుమారుడు మానసిక స్థితి కూడా సరిగా లేదని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య పరిశీలించి, వివరాలు సేకరించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.