calender_icon.png 5 March, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

05-03-2025 12:00:00 AM

నిజాం సాగర్ మార్చి 4 (విజయ క్రాంతి)కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రానికి చెందిన అంద్యాల హరికుమార్ (26) అనే వ్యక్తి  నిజాంసాగర్ ఈ నెల 1న ప్రాజెక్టులో ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన హరికుమార్, మధ్యాహ్నం సమయంలో అతడు నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకుతుం డగా బంజేపల్లికి చెందిన వ్యక్తి చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందిం చాడు.

సోమవారం ఉదయం హరికుమార్ మృతదేహం నీటిపై తేలడంతో పోలీసులు బయటికి తీయించారు. మద్యానికి బానిసైన హరికుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.