కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో దూకి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా(Rangareddy District Ibrahimpatnam Mandal) ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని చర్ల పటేల్ గూడా గ్రామానికి చెందిన బి.మహేష్ (30) మునగనూరులో నివాసం ఉంటున్నాడు. శనివారం నుంచి మహేష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు(Pedda Cheruvu) చిన్న తూము వద్ద మహేష్ ద్విచక్ర వాహనం, హెల్మెట్, అతని పర్సు ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు లో మహేష్ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.