28-04-2025 12:56:28 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 27: ఉరివేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.స్థానిక ఎస్త్స్ర బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గాంధీనగర్ కు చెందిన జక్కలి జనార్దన్(30) జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన నవ్యను 9 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.ఉగాది పండుగ సందర్భంగా నవ్య తన ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లిగారి ఊరైన కొమ్మాలకు వచ్చి అక్కడే ఉండిపోయింది.గత మూడు రోజుల క్రితం భర్త జనార్ధన్ కొమ్మాల గ్రామానికి వెళ్ళాడు.
శనివారం రాత్రి భార్యతో గొడవ జరగగా ఇంట్లోని బెడ్ షీట్ తీసుకొని బయట నిద్రిస్తానని చెప్పి వెళ్ళాడు.ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద గల రేకుల షెడ్డులో ఉరివేసుకొని మృతి చెందాడు.మృతిని తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర బాలకృష్ణ తెలిపారు.