27-03-2025 07:22:20 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన మంతెన శివకుమార్ (30) అనే వ్యక్తి గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ ఎస్సై రాకేష్ తెలిపారు. మృతునికి 8 ఏళ్ల కిందట ప్రేమ వివాహం జరిగిందని, ఆరు నెలల కిందట భార్య మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని తెలిపారు. హైదరాబాదులో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవిస్తున్న క్రమంలో రోడ్డు యాక్సిడెంట్ లో ఎడమ కాలు విరగడంతో డ్రైవర్ ఉద్యోగం చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎస్సై రాకేష్ తెలిపారు. ఒంటరితనంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుని తల్లి మంతెన రామక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాకేష్ చెప్పారు.