calender_icon.png 5 April, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

20-03-2025 01:53:52 AM

నల్లగొండ, మార్చి 19 (విజయక్రాంతి) :  కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్యాల గూడ పట్టణం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. వివరాలివి.. భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉండే ముడావత్ నాగు (35) భార్య ప్రియకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

మంగళవారం రాత్రి 9 గంటలకు కుమార్తెను ట్యూషన్ నుంచి ఇంటి తీసుకొచ్చేందుకు ప్రియ  వెళ్లింది.  ఈ క్రమంలో నాగు బెడ్రూం లోపలి గడియపెట్టుకొని చీరతో ఉరేసుకు న్నాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన భార్య పక్కింటివారి సాయంతో తలుపులు పగుల గొట్టి నాగును చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

కుమారుడి మృతికి కోడలు ప్రియ ఆమె అక్కాబావ సైదా, విజయ కారణమని అనుమానిస్తూ మృతుడి తండ్రి పంతులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ టూటౌన్ సీఐ నాగార్జున తెలిపారు.