03-03-2025 06:44:28 PM
పాపన్నపేట: ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని మల్లంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగన్నోల్ల రత్నయ్య (55) కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి అదే గ్రామంలో తన కూతురి ఇంటి వద్ద ఎవరు లేకపోవడంతో కూతురు ఇంట్లో నిద్రించేందుకు వెళ్లాడు.
సోమవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు చూడగా రత్నయ్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని కూతురు ఉషాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.