19-03-2025 06:20:50 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన మగ్గిడి రాజ్ కుమార్ అనే వ్యక్తి బుధవారం మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. మృతుడు నిత్యం మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడని తెలిపారు. ఈనెల 14న మద్యం తాగి భార్య లావణ్యతో గొడవ పడడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో మనస్థాపానికి గురైన రాజ్ కుమార్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు. రాజ్ కుమార్ అన్న మగ్గిడి ప్రసాద్ వెంటనే మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించి అక్కడ నుండి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా శనివారం రాత్రి రాజ్ కుమార్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని తల్లి మగ్గిడి బాలక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.