calender_icon.png 28 April, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలుకు ఎదురెళ్లి.. వ్యక్తి ఆత్మహత్య

26-04-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తాళ్లపూస పల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. వరంగల్ జీ ఆర్పీ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కాశీరామ్ తండాకు చెందిన బానోతు రమేష్ అనే వ్యక్తి గురువారం రాత్రి చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంఘటనకు సంబంధించి రైలు లోకో పైలట్ వరంగల్ స్టేషన్ మాస్టర్ కు ఫిర్యాదు చేయగా స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలికి వెళ్లి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. సంఘటనస్థలికి కొద్ది దూరంలో మృతుడికి సంబంధించిన సైకిల్ మోటార్, సెల్ ఫోన్ గుర్తించామని తెలిపారు.

మృతుడి కేబులో లభించిన పర్సులో ఆధార్ కార్డు ఆధారంగా మృతున్ని గుర్తించి సంబంధితిలకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు అప్పుల పాలై గత కొద్దిరోజులుగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మృతుడు రమేష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.