27-03-2025 08:47:24 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల రైల్వే లైన్ పై గురువారం మధ్యాహ్నం సిర్పూర్ ప్యాసింజర్ రైలు కిందపడి 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని రైల్వే హెడ్ కానిస్టేబుల్ కె.సురేష్ గౌడ్ తెలిపారు. మృతుడు గుండు చేయించుకుని ఉన్నాడని తెలిపారు. ఎల్లో కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్, గ్రీన్ కలర్ షాట్ ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసినవారు 9948481902, 9490871784 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.