04-03-2025 08:25:43 PM
పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన బండారి ప్రకాష్ (37) గత కొంతకాలం నుండి మద్యానికి బానిసై ఎటువంటి పని చేయకుండా ఖాళీగా ఉంటూ, కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది సోమవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మేరకు మృతుని భార్య బండారి తులసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయబడినదని పిట్లం ఎస్సై రాజు మంగళవారం వెల్లడించారు.