04-03-2025 12:29:23 AM
కామారెడ్డి, మార్చి 3 (విజయక్రాంతి) : అప్పుల బాధతో మద్యానికి బానిసై ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుందని ఎస్సు వెంకట్ రావు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మెతుకు సాయిలు (42) అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో కూతురుకు వివాహం చేసి అప్పుల పాలై మద్యానికి బానిసై పొలంలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు.భార్య యశోద పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సు తెలిపారు.