calender_icon.png 10 April, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మోసం

07-04-2025 11:21:27 AM

హైదరాబాద్: విక్రమార్కుడు సినిమాలో లక్ష్మీదేవి కనికరిస్తోందని రవితేజ, బ్రహ్మానందం అందరికీ గుండు కొట్టి డబ్బు క్యాష్ చేసుకుంటారు. ఈ సినిమాలో ఈ సీన్ అందరినీ కడుపుబ్బ నవ్వించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ బహదూర్ పురాలో బట్టతల మీద జుట్టు రప్పిస్తానని ఓ వకీల్ ఎంతో మంది యువకులకు గుండ్లు కొట్టాడు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోతుంది. చాలా మంది డిప్రెషన్ లోకి పోతుంటే కొందరు బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ మోసం చేస్తున్నారు.

పాతబస్తీ ఫతే దర్వాజా(Old City Fateh Darwaza) కేంద్రంగా సోషల్‌ మీడియాలో జోరాగా ప్రచారం జరిగింది. ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్‌కి జట్టు మొలిపించానంటూ ప్రచారం చేశారు. దీంతో బట్ట తలపై జుట్టు వస్తుందని వందలాది మంది యువకులు బిగ్‌బాస్‌ సెలూన్‌ ముందు క్యూ కట్టారు. వకీల్ అందరికీ గుండు గీసి కెమికల్స్‌ రాసి పంపాడు. సైడ్‌ ఎఫెక్ట్‌ రావడంతో లబోదిబోమంటూ బాధిత యువకులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది. సోషల్ మీడియా వేదికగా బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తామని ఎన్నో ప్రకటనలతో అమాయక జనాలను బోల్తా కొట్టిస్తున్నారు.