18-03-2025 02:10:33 PM
క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు : కమలాకర్ సీఐ
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో జడ్చర్ల సిఐ కమలాకర్(Judge CI Kamalakar) ఆధ్వర్యంలో ఘటన స్థలానికి చేరుకొని అక్కడ క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసుకుని క్లూస్ టీం తో విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. జడ్చర్ల పట్టణం కావేరమ్మపేట కూరగాయల మార్కెట్ కు ఎదురుగా రోడ్డు ప్రక్కన సుమారు 40-45 సంవత్సరాల మధ్య వయసు గల ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి హత్య కు గురి కావడం జరిగింది.
మృతుని వివరాలు తెలియ రాలేదు. మృతుని శరీరముపై తెలుపు రంగు డబ్బాల నీలం రంగు హాఫ్ షర్ట్, మెరున్ కలర్ ఫుల్ డ్రాయర్ కలవు. మెడలో రుద్రాక్షం కలిగిన కాషాయం దండ, నడుముకు నాలుగు వరుసల ఎర్రని మొలతాడు ఉండి అట్టి మొలతాడుకు ఒక గజ్జ, తాయత్తు, ఒక రూపాయి కాయిన్ ఉన్నవి. ఇట్టి గుర్తుతెలియని మృతుని వివరాలు ఆధారంగా తెలిస్తే సమాచారం ఇవ్వాలని సిఐ కమలాకర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. తెలియజేసిన గుర్తుల ఆధారంగా సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే జడ్చర్ల పిఎస్ ను సంప్రదించాలని కోరారు. 8712659314, 8712659343 నెంబర్లను సంప్రదించి సమాచారం అందించాలని సీఐ కమలాకర్ తెలియజేశారు.