calender_icon.png 19 January, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

19-01-2025 03:02:16 PM

ఆస్తుల కోసమే హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు

కామారెడ్డి జిల్లా అన్నారంలో ఘటన

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓక వ్యక్తి తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన అదివారం అలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా(Kamareddy District) రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో జరిగిన హత్య గుర్తించి రామారెడ్డి ఎస్సై నరేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పోక్కిలి జంపాల రవి (48 ) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పోడిచి హత్య చేశారు . హతుడి భార్య సంగీత తన ఇద్దరు కుతుళ్లతో పుట్టింటికి వేళ్లినప్పుడు శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని తెలిపారు.

హతుడు జంపాల రవి (48 ) గత కొద్ది రోజుల క్రితం తన అన్నను చంపాలనే ఉద్దేశంతో రాత్రింబవలు వెంబడించాడని గ్రామస్థులు తెలిపారు. అస్తుల పంపకాలు జరిగినప్పటికి రెండు కుటుంబాల మద్య గోడవలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే అదును చూసి వారు జంపాల రవిని హత్య చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని సిఐ రమన్ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ప్రభుత్వసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.