సూర్యాపేట,(విజయక్రాంతి): వ్యక్తిని తలపై మోదీ దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని చివ్వెంల మండలం గుర్రంతండాలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్రంతండాకు చెందిన సైదులుకు ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు వీరంతా కలిసి ఒకే చోట ఉంటున్నారు. అయితే సైదులు తన భార్యలు, కుమార్తెను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత తలపై, శరీరంపై బలమైన గాయాల కారణంగా మృతి చెంది ఉన్నట్టు తెలిపారు. కాగా కూతుర్ని లైంగికంగా వేధించడం కారణంగానే భార్యలు సైదులు తలపై బలంగా మోదీ హతమార్చి ఉండొచ్చని అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. కాగా సైదులు మృతికి సంబంధించిన అసలు వివరాలు తెలియాల్సి ఉంది.