22-02-2025 06:29:52 PM
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోని గోపి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నజీర్(28)ను అతని సన్నిహిత నలుగురు మిత్రులు శుక్రవారం రాత్రి నితో కొంచం మాట్లాడే విషయం ఒకటి ఉందని గోపి చెరువు దగ్గర నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళి నలుగురు మిత్రులు కలసి నజీర్ ను అర్ధరాత్రి సమయంలో కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. అనంతరం గాయాల పాలైన నాజీర్ ను దాడి చేసిన స్నేహితులే కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. గాయాల పాలైన నాజీర్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు నాజీర్ ను ఉద్దేశ పూర్వకంగానే తమ కుమారుడిని హతమార్చినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ..మృతుడి స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.