09-04-2025 11:30:42 AM
రిలయన్స్ డిజిటల్ షోరూమ్ వద్ద రక్తం మడుగులో పడిన ఉన్న మృతదేహం...
ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్(Hayathnagar Division Area) పరిధిలోని ముద్దిరాజ్ కాలనీకి చెందిన నగేశ్, శిరీష భార్యాభర్తలు. కాగా, కుటుంబ కలహాలతో భార్య శిరీష మంగళవారం ఆత్మహత్య చేసుకున్నది. ఈ కేసులో భర్త నగేశ్ ను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సాయంత్రం బంధువులు జామీను పై నగేశ్ ను ఇంటికి తీసుకుని వచ్చారు.
అయితే, బుధవారం తెల్లవారుజామున నగేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. హయత్ నగర్ కుంట్లూరు రోడ్డులో ఉన్న రిలయన్స్ డిజిటల్ షాపింగ్ మాల్స్(Reliance Digital Shopping Malls) ఎదుట రక్తపు మడుగులో నగేశ్ మృతి చెంది, పడి ఉన్నాడు. నగేశ్ ను హత్య చేసి మృదేహాన్ని ఇక్కడ పడేశారా...? లేదా అక్కడే హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు ఉన్నాయి. మృతుడి తలక, చేతులు, కాళ్లకు కత్తి గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు.