సిద్దిపేట, జనవరి 30 (విజయక్రాంతి) : మున్సి పల్ కార్యాలయం ముం దు వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సం ఘటన సిద్దిపేటలో కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని 12 వ వార్డుకు చెందిన పసుపునూరి చంద్రం తన ఇంటి నిర్మానం చేస్తున్నా క్రమంలో సెట్ బ్యాక్ నిబంధనలకు లోబడి నిర్మాణం కొనసాగడం లేదని కాంపౌండ్ వాల్ ని మున్సిపాలిటీ అధికారులు కూలాగొట్టారని ఆరోపిస్తూ గురువారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు, పోలీసులు సకాలంలో స్పదించడం పెను ప్రమాదం తప్పింది.