న్యూఢిల్లీ, డిసెంబర్ 25: పార్లమెం ట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. సద రు వ్యక్తి నిప్పంటించుకుని సూసైడ్‌కు యత్నించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లో చికిత్స పొం దుతున్నాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి యూపీలోని బాగ్‌పథ్‌కు చెందిన జితేంద్రగా పోలీసులు గుర్తించారు. అతడి శరీరం 90 శాతం కాలి పోయినట్లు తెలిపారు. అయితే ఘట నా స్థలంలో డైరీ, రెండు పేజీల సూసై డ్ నోట్‌ను కూడా పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.