04-04-2025 10:37:29 PM
తన మాట వినడం లేదని కక్ష పెంచుకొని హత్య
జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి
జహీరాబాద్: మహిళపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించగా మహిళా అడ్డుకోవడంతో చిన్న గ్యాస్ సిలిండర్ తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారని జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య వివరాలు తెలిపారు. కోహీర్ మండలంలోని గోటిగార్ పల్లి గ్రామానికి చెందిన నేరస్తుడైన సత్యారం రమేశ్ @ రవి(26) మే 2023 నుండి చిలమామిడి గ్రామనికి చెందిన మ్యాతరి లక్ష్మితో సహజీవనం చేస్తున్నారని తెలిపారు. నేరస్తుని యొక్క ప్రవర్తన సరిగ్గా లేనందున మృతురాలు నేరస్తున్ని దూరం పెట్టి వేరే వాళ్ళ తో ఉంటుందన్నారు.
నేరస్తుడు మృతురాలు లక్ష్మి పై కోపం పెంచుకొని చంపుటకు మార్చి 29 న లక్ష్మి ని ఆర్‌టిఏ చెక్ పోస్ట్ దగ్గర గల కల్లు దుకాణం లో కల్లు తాపీ పెట్రోల్ పోసి చంపుటకు ప్రయత్నిచగా అక్కేడే ఉన్న మ్యాతరి మరియమ్మ అడ్డు రాగా ఆ రోజు చంపుటకు కుదర లేదన్నారు. తేదీ మార్చి 31న ఉదయం 07.30 గంటలకు లక్ష్మి ఇంటికి వెళ్ళి తనతో బలాత్కారం చేసేందుకు ప్రభుత్వం చేయగా ఇద్దరి మద్య గోడవ జరిగిందన్నారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తప్పించుకొనేందుకు రమేష్ కళ్ళలో ఎర్ర కారం పొడి చల్లగా, వెంటనే నేరస్తుడు పకనే ఉన్న చిన్న 5 కిలోల ఖాళీ గ్యాస్ లిండర్ తో మృతురాలు తల పై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలు అరవడంతో చుట్టూ పక్కల ఉన్న వారు ఇంటి వద్దకు రాగానే నేరస్తుడు మృతురాలి సెల్ ఫోన్ తీసుకొని పారిపోవడం జరిగిందన్నారు.శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో నేరస్తుడు హైదరాబాద్ కు పారిపోదామని జహీరాబాద్ ఆర్‌టిసి బస్ స్టాండు కు రాగా నేరస్తున్ని పట్టుకొని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామన్నారు.