కుటుంబ కలహాలతో వదినను హత్య చేసిన మరిది
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో బొమ్మల హత్యకు గురైంది. సొంత మరిది వదినను శుక్రవారం హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భిక్కనూర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు మండలం బాగిర్తిపల్లికి చెందిన ఏసుమని (40) అనే మహిళను ఆమె మరిది సురేష్ డబ్బులు ఇవ్వలేదని కక్షతో పదునైన ఆయుధంతో గాయపర్చినట్లు పోలీసులు తెలిపారు. సురేష్ తండ్రి అనారోగ్యానికి గురి కాగా ఆస్పత్రికి ఖర్చులు తానే పెడుతున్నానని తన అన్న ఇవ్వకుండా ఏసు మని అడ్డుకుంటుందని కక్షతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఏసుమని అక్కడికక్కడే మృతి చెందినట్లు సంఘటన స్థలాన్ని సిఐ సాయికుమార్ ఎస్ఐ సంపత్ కుమార్ పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యకు దారి తీసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భిక్కనూర్ పోలీసులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బులు విషయంలో సొంత అది నేను మరిది హత్య చేయడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.