calender_icon.png 21 December, 2024 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎస్సై పేరుతో.. సైబర్ మోసం

03-08-2024 11:49:54 AM

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ రాణా నుంచి ఏఎస్సైని మాట్లాడుతున్నా.. కానిస్టేబుల్ భార్య పరిస్థితి విషమంగా ఉంది.. హోంగార్డు ద్వారా రూ.90,000 డబ్బులు పంపిస్తున్నా.. తొందరగా మీరు నా ఖాతాకు ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేయాలని' మీ సేవా నిర్వాహకుడికి పోన్ వచ్చింది. నిజమే అనుకొని మీ సేవా నిర్వాహకుడు రూ.90 వేలను ఆన్ లైన్ ద్వారా డబ్బులు జమ చేశాడు.

ఎంత సేపటికి హోంగార్డు ద్వారా డబ్బలు అందకపోవడంతో మీసేవా నిర్వాహకుడు చీర్ల తిరుపతి మహదేవ పూర్ రాణాకు వెళ్లి పోలీసులను అడిగారు. దీంతో పోలీసులు ఇక్కడ ఏఎస్సై అసలు లేరని, మీకు ఎవరు ఫోన్ చేశారో..? మీరు ఎవరికి డబ్బులు పంపారో.. అనడంతో అవాక్కయ్యాడు. విషయంపై పూర్తిగా ఆరా తీయగా ఏఎస్సై పేరుతో సైబర్ మోసగాడు ఎర వేసినట్లు గ్రహించాడు. ఈ ఘటనతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే సైబర్ క్రైం ఫోన్ నంబరు 1930కు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ పవన్ వెల్లడించారు.