calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్‌ఫోన్ చోరీ కేసులో వ్యక్తి అరెస్టు

12-04-2025 12:10:21 AM

105 సెల్ ఫోన్లు పట్టివేత 

 రాజేంద్రనగర్ (కార్వాన్) ఏప్రిల్ 11: తీగల లాగితే.. డొంక కదిలింది అన్నట్లు ఒక సెల్ఫోన్ చోరీ కేసులో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా 105 సెల్ ఫోన్లు లభించాయి. శుక్రవారం సాయంత్రం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గోల్కొండ ఏసీపి సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్లు రఘుకుమార్, సైదులతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. లంగర్ హౌస్ లోని మొగల్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జలీల్ ఈనెల 8వ తేదీన తన సెల్ఫోన్ పోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారించిన పోలీసులు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెంది న ఎరుకల కాడి అశోక్ ను పట్టుకొని తమదైన శైలిలో విచారించారు.

అతడి నుంచి 105 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతడికి సహాయం చేసిన గణేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కేసును చేదించిన లంగ ర్ హౌస్ ఇన్‌స్పెక్టర్ రఘుకుమా తో పాటు ఇతర క్రైమ్ సిబ్బందిని డిసిపి ప్రత్యేకంగా అభినందించినట్లు ఎసిపి సయ్యద్ ఫయాజ్ తెలిపారు. బాధితులకు సెల్ఫోన్లను అప్పగించనునట్లు పేర్కొన్నారు. నిందితుడుపై గతంలో పలికేశ్వరుడు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు రాజు దీపిక తదితరులు పాల్గొన్నారు.