కరీంనగర్ సిటీ, జూలై 22: గన్నేరువరం మండల కేంద్రంలోని మాలకుంట కట్ట తవ్వి ఆక్రమించిన కేసులో మాజీ సర్పంచ్ భర్త లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు భూ ఆక్రమణ, ఆస్తులు ధ్వంసం చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాలకుంట కట్ట తవ్వి, ఆక్రమించిన కేసులో సంబంధం లేని రైతుల పేర్లు చేర్చవద్దని ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులను కోరారు. అసలు దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.