calender_icon.png 19 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

12-04-2025 10:30:13 AM

మేడ్చల్ అర్బన్: (విజయక్రాంతి): మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావల్ కోల్ కమాన్ వద్ద మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు(Medchal Excise Police) వాహనాల తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా ఓమర్ అలీ అనే వ్యక్తి టీవీఎస్ అపాచీ టూ వీలర్ వాహనం పైన 1.2, కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తూ మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుపడ్డాడు ఇతను మేడ్చల్ మున్సిపల్ పరిధి(Medchal Municipal Area)లోని కిష్టాపూర్ వాసిగా గుర్తించారు కిష్టాపూర్ అర్చన కాలనీలో ఉంటూ ఈజీ మనీ కి అలవాటు పడి గంజాయిని 10 గ్రాముల ప్యాకెట్లుగా చేసి ఒక్కొక్క ప్యాకెట్ను 1000 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు మేడ్చల్ ఎక్సైజ్ సీఐ నవనిత తెలిపారు సదరు వ్యక్తిని రెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని తెలిపారు రూట్ వాచ్ లో భాగంగా గంజాయిని పట్టుకున్న ఎస్సై వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్స్, ఎం.డి మన్సూర్, శ్వేతలను అభినందించారు.