calender_icon.png 15 March, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్ట్ చేసిన వ్యక్తి వివరాలు తెలుపుతున్న పాల్వంచ సీఐ

08-03-2025 11:09:09 PM

నవభారత్ కాలనీలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

రూ.2 లక్షలు, సెల్ ఫోను స్వాధీనం

మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత కాలనీలో జనవరి 25వ తేదీన చోరీకి పాల్పడిన వ్యక్తిని శనివారం పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి రూ.2 లక్షల నగదు సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ పట్టణ సిఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం కేటీపీఎస్సీ కాలనీ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పెరుగుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అతని అదుపులోకి తీసుకొని విచారించగా నవభారతిలో చోరీకి పాల్పడిన వ్యక్తిగా నిర్ధారణ అయింది అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం, దార్ జిల్లా, తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగోలి (బెల్ గ్యాంగ్) కు చెందిన అనిల్ సింఘార్ సింగ్ అనే మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి జనవరి 25వ తేదీన అర్ధరాత్రి సమయంలో పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ ఎంప్లాయిస్ క్వార్టర్లో దొంగతనాలు పాల్పడినట్టు అంగీకరించాడు. ప్రస్తుతం సీ కాలనీలో చోరీ చేసేందుకు రక్కీ నిర్వహించేందుకు వచ్చినట్టు అంగీకరించాడు. అతను నుంచి రూ 2 లక్షల నగదు, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. నిందితుని కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ సమావేశంలో పాల్వాన్ చట్టం ఎస్సై సుమన్ పాల్గొన్నారు.