28-03-2025 12:01:44 AM
కూకట్ పల్లి మార్చి 27(విజయక్రాంతి): ల్యాప్ టాప్ దొంగతనాలకు పాల్పడుతున్నా ఓ వ్యక్తిని కెపిహెచ్బి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. గురువారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి శ్రీనివాసరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన జివ్వ గణేష్ (26) మేస్త్రి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మేస్త్రి పనిచేసి ఏం సాధించలేవు అని సులువుగా ఎలా డబ్బు లు సంపాదించాలో నేర్పిస్తానని ముంబైకి తీసుకెళ్లి దొంగత నాలు ఏ విధంగా చేయాలో నేర్పించేవాడు. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశతో కెపిహెచ్బి కాలనీ ప్రాంతంలో సాఫ్ట్వేర్, ఉద్యోగులు, విద్యార్థులు అద్దెకు ఉంటున్న ఇండ్లను టార్గెట్ చేశాడు.
వారు ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో చేతివాటం చూపెట్టి ల్యాప్‌టాప్ లు చోరీ చేసేవాడు. ల్యాప్ టాప్‌లు దొంగతనాలకు గురవుతున్నాయని పలువురు విద్యా ర్థులు కేపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం కె.పి.హెచ్.బి పెట్రోల్ బంకు వద్ద అనుమానంగా తిరుగుతున్న గణేష్ నీ పోలీసులు అదుపులోకి తీసుకూని విచారించగా కూకట్పల్లి, మియాపూర్, కెపిహెచ్‌బి ప్రాంతా ల్లో మొత్తం పది ల్యాప్ టాప్‌లు దొంగిలించినట్టు పోలీస్ విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి సుమారు ఆరు లక్షల విలువగల ఆరు ల్యాప్టాప్‌లు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలిస్తున్నట్లు ఏసిపి తెలిపారు.